అప్పుడెప్పుడో వచ్చిన 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి' సినిమా హిట్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు దర్శకుడు రాజా వన్నెం రెడ్డి.'క్షేమంగా వెళ్లి లాభంగా రండి-2' అనే టైటిల్ ని రిజిస్టర్ చేసుకున్నాడు ఈ దర్శకుడు.ఈ సినిమా త్వరలో మొదలయ్యే అవకాశాలు వున్నాయి.