ఒకప్పటి సంగీత దర్శక ద్వయం రాజ్-కోటి పదిహేడు సంవత్సరాల తరువాత మళ్ళీ కలవనున్నారు.ఈ విషయాన్ని ఒక చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరు వెల్లడించారు.ఒకప్పుడు వీరు మంచి ఫాంలో వుండగా భేదాభిప్రాయాలు వచ్చి విడిపోయారు.ఇప్పటికీ తమ దగ్గర మునుపటి ఫైర్ వుందని సంగీతంలో వస్తున్నమార్పులను ఎప్పటికప్పుడు మేము చర్చించుకుంటున్నాము అని అంటున్నారు రాజ్-కోటి.వీరి దగ్గర పనిచేసిన ఎఆర్ రెహమాన్ ఇంటర్నేషనల్ స్థాయికి ఎదిగిన సంగతి తెలిసిందే.
