పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ టీజర్ వీడియోని వచ్చే నెల 14 న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.మొన్నీ మధ్యనే దర్శకుడు హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ స్టిల్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన శ్రుతిహాసన్ నటిస్తుంది.పరమేశ్వర ఆర్ట్స్ బ్యానర్ పై గణేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కేరళలోని పొల్లాచ్చిలో జరుగుతుంది.దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
